గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జులై 2023 (12:54 IST)

పెళ్లామే కదా అని ముద్దుపెట్టుకోబోయాడు.. అంతే నాలుకను కొరికేసింది..

tongue
పెళ్లామే కదా అని బలవంతంగా ముద్దుపెట్టుకోవాలనుకున్నాడు. కానీ అతనికి చుక్కలు కనిపించాయి. తనను బలవంతంగా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించిన భర్త నాలుకను అమాంతం కొరికేసింది ఆతని భార్య. ఈ ఘటన 
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం గుట్టతండాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తారాచంద్ నాయక్, పుష్పవతి దంపతులు వీరు 2015లో ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 
 
గురువారం ఇలా జరిగిన గొడవను సద్దుమణిగేలా చేసేందుకు భార్యకు ముద్దివ్వడమే మంచి మార్గం అంటూ తారాచంద్ భావించాడు. ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికే పిచ్చి కోపంలో ఉన్న ఆమె ఒక్కసారిగా భర్త నాలుకను కొరికిపడేసింది. దీంతో తారాచంద్ లబోదిబోమంటూ గుర్తి ఆసుపత్రికి పరిగెట్టారు. 
 
అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఈ దర్యాప్తులో తారాచంద్ భార్య ప్రవర్తన సరిలేదని.. వేరొక వ్యక్తితో ఆమెకు సంబంధం వున్నట్లు ఆరోపించాడు. పుష్పవతి కూడా భర్త బలవంతంగా ముద్దుపెట్టాలని ప్రయత్నించాడని.. అందుకే అలా జరిగిపోయిందని చెప్పుకొచ్చింది. అంతటితో ఆగలేదు. భర్తపై ఫిర్యాదు కూడా చేసింది.