శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 21 మార్చి 2018 (14:45 IST)

'భజరంగీ భాయ్‌జాన్' రికార్డులు బ్రేక్ చేసేందుకు సిద్ధమైన 'బాహుబలి 2'

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి - హీరో ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బాహుబలి : ది బిగినింగ్, బాహుబలి 2. ఈ రెండు చిత్రాలు సరికొత్త చరిత్రను లిఖించాయి. ముఖ్యంగా బాహుబలి 2 చిత్రం భారతీయ చలన చిత్ర పర

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి - హీరో ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బాహుబలి : ది బిగినింగ్, బాహుబలి 2. ఈ రెండు చిత్రాలు సరికొత్త చరిత్రను లిఖించాయి. ముఖ్యంగా బాహుబలి 2 చిత్రం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఇపుడు చైనా భాషలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. 
 
నిజానికి ఇటీవలి కాలంలో చైనాలో విడుదలై బాలీవుడ్ సినిమాలు భారీ వసూళ్లను సాధించాయి. అమీర్ ఖాన్ నటించిన "దంగల్", సల్మాన్ ఖాన్ నటించిన 'భజరంగీ భాయ్‌జాన్' చిత్రానికి చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చైనా భాషలో విడుదల చేసిన మన అసలు సిసలు తెలుగు చిత్రం 'బాహుబలి...ది బిగినింగ్'కి కూడా చెప్పుకోదగ్గ ఆదరణే లభించింది. 
 
ఇప్పుడు 'బాహుబలి 2 : ది కన్‌క్లూజన్' వంతొచ్చింది. ఈ భాగం కూడా అక్కడ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మనదేశంలో 'బాహుబలి' డబ్బింగ్ వెర్షన్‌కు కూడా విపరీతమైన ఆదరణ లభించింది. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించిపెట్టిన తొలి డబ్బింగ్ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు చైనాలోనూ 'బాహుబలి-1' నెలకొల్పిన రికార్డును బాహుబలి-2 బద్దలు కొడుతుందని సినీ వ్యాపార విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.