ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 27 ఏప్రియల్ 2017 (01:36 IST)

మాయాబజార్ ఒక అద్బుతచిత్రం. బాహుబలి మహాద్భుతం: రాజమౌళి ప్రశంసలు

ఎప్పుడో చిన్నతనంలో చూసిన మాయాబజార్ సినిమా మనసుపై ముద్ర వేసిందని. తాను దర్శకుడిని అయిన తర్వాతే అంత గొప్ప సీన్లు మాయాబజార్‌లో ఎలా తీసి ఉంటారు అనే ఆలోచన వచ్చిందని దర్శక మాంత్రికుడు ఎస్ఎస్ రాజమౌళి చెప్పారు. మాయాబజార్‌లో రెండు నిమిషాల పాటలో ఆ సినిమాలోని ప

ఎప్పుడో చిన్నతనంలో చూసిన మాయాబజార్ సినిమా మనసుపై ముద్ర వేసిందని. తాను దర్శకుడిని అయిన తర్వాతే అంత గొప్ప సీన్లు మాయాబజార్‌లో ఎలా తీసి ఉంటారు అనే ఆలోచన వచ్చిందని దర్శక మాంత్రికుడు ఎస్ఎస్ రాజమౌళి చెప్పారు. మాయాబజార్‌లో రెండు నిమిషాల పాటలో ఆ సినిమాలోని పాత్రలన్నింటిని పరిచయం చేయడం విశేషమమని, మరీ ముఖ్యంగా ఆరోజుల్లోనే ఆ సినిమాలో ఉపయోగించిన గ్రాఫిక్సం అద్భుతమని అందుకు మాయాబజార్ సినిమా దర్శకుడు కేవీ రెడ్డిగారికి హ్యాట్సాఫ్ అంటూ రాజమౌళి ప్రశంసల వర్షం కురింపించారు.
 
దర్శకుడిగా నాకు వేరే లక్ష్యాలు ఏవీ లేవు. నేను నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎప్పుడో చేరుకున్నా. మహాభారతం తీయాలనుందని చాలా రోజుల నుంచి చెబుతున్నా. కానీ, ఓ పదేళ్ల వరకూ దాన్ని టచ్‌ చేయను. మహాభారతం తీసేంత స్కిల్స్‌ నాలో లేవు అన్నారు రాజమౌళి.
 
∙బయట దేశాలవారికి తెలుగు, తమిళ, దక్షిణాది సినిమాల గురించి అస్సలు తెలీదు. భారతీయ సినిమా గురించి పెద్దగా తెలీదు. ఒకవేళ హిందీ సినిమాల గురించి తెలిసినా... షారుక్‌ఖాన్‌ అంటుంటారు. అటువంటి స్థాయి నుంచి భారతీయ సినిమా అంటే ‘బాహుబలి’ అనే స్థాయికి తీసుకురాగలిగాం. ఇది నాకెంతో గర్వంగా అనిపించింది. సినిమా అంత పెద్ద హిట్టయితే ఎవరికైనా గర్వం ఉంటుంది. అయితే... ఇంట్లో మా ఆవిడ, మా వదిన క్లాస్‌ పీకి నా గర్వానికి బ్రేకులు వేస్తారు.