బాలయ్య, అమితాబ్ కలిసిన వేళ!
నందమూరి బాలకృష్ణ.. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో దర్బార్‌లో కొన్ని సీన్లు చేశారు. కాగా, ముంబైలో కీలక షెడ్యూల్ జరిగింది. ఇదిలావుండగా.. ముంబైలోని స్టూడియోలో అమితాబ్ నటిస్తున్న సర్కార్ సీక్వెల్ సినిమ
నందమూరి బాలకృష్ణ.. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో దర్బార్‌లో కొన్ని సీన్లు చేశారు. కాగా, ముంబైలో కీలక షెడ్యూల్ జరిగింది. ఇదిలావుండగా.. ముంబైలోని స్టూడియోలో అమితాబ్ నటిస్తున్న సర్కార్ సీక్వెల్ సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఈ సందర్భంగా అమితాబ్‌ను కలవడానికి బాలయ్య, దర్శకుడు కృష్ణవంశీ కలిసి వెళ్ళారు. అక్కడ జరిగిన ఈ సంఘటనకు చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఏదో విషయంపై వారు వెళ్ళినట్లు తెలిసింది. ఆ వివరాలు త్వరలో తెలియనున్నాయి.