మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?
భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం. అన్నిటిని మించి కాస్తం బెల్లం ముక్క నోట్లో వేసుకుని చప్పరిస్తుంటే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. బెల్లంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
బెల్లంలో ఇనుము వుంటుంది కనుక ఎనీమియా రోగులు తింటే మేలు కలుగుతుంది. మరీ ముఖ్యంగా మహిళలు బెల్లాన్ని సేవించడం అత్యావశ్యకమైనది.
బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది, బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్దీకరణ చేస్తుంది.
ప్రతిరోజూ గ్లాసు పాలు లేదా నీటితో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది.
బెల్లం రక్తం లోని ప్రమాదకరమైన టాక్సిన్లను దూరం చేసి చర్మానికి మంచి మెరుపునిచ్చి మొటిమలని నివారిస్తుంది.
బెల్లం తింటుంటే జలుబు, దగ్గు, రొంపలాంటివాటికి ఉపశమనం ఇస్తుంది. జలుబు వలన బెల్లం తినలేనట్లయితే టీలో కలిపి సేవించవచ్చు.
రోజంతా పనిచేసిన తర్వాత మీకు అలసటగా అనిపిస్తే వెంటనే బెల్లాన్ని తినేయండి.
బెల్లం ముక్కతో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.
5 గ్రాముల బెల్లం అంతే పరిమాణంలోని ఆవాల నూనెతో కలిపి తీసుకొంటే శ్వాస సంబంధిత వ్యాధులు నయమవుతాయి.