ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2024 (09:04 IST)

ఆరోగ్యం బాగాలేక మోక్షజ్ఞ చిత్రం వాయిదాపడింది : హీరో బాలకృష్ణ

balakrishna
తన కుమారుడు మోక్షజ్ఞ చిత్రం ప్రారంభోత్సంపై హీరో నందమూరి బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. ప్రశాంత్ వర్మ దర్శత్వంలో మోక్షజ్ఞ చిత్రం ప్రారంభంకావాల్సివుంది. కానీ అనివార్య కారణాలతో ఈ చిత్రం ప్రారంభంకాలేదు. దీనిపై హీరో బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. గురువారం కాకినాడలో జరిగిన ఓ షాపు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ స్పందించారు. మోక్షజ్ఞ చిత్రం మొదలుపెట్టాల్సింది. కానీ, అనివార్య కారణాల వల్ల అది వాయిదాపడిందన్నారు. ఆయన ఆరోగ్యం బాగోలేకపోవడంతో ప్రారంభోత్సవం వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. అంతా మనమంచికే అని అనుకోవడం తప్పితే వేరే ఏమీలేదన్నారు. ప్రజల ఆశీస్సులు అభిమానుల మద్దతు మోక్షజ్ఞకు ఎపుడూ ఉంటుందని బాలయ్య అన్నారు. 
 
కాగా 'హనుమాన్' మూవీతో సెన్సేషన్ అయిన దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శత్వంలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ చేయించేందుకు బాలకృష్ణ నిర్ణయించారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో తొలి చిత్రానికి ప్లాన్ చేశారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ప్ర్రారంభంకావాల్సివుంది. అయితే, అనివార్య కారణాలతో ఈ కార్యక్రమం రద్దు అయింది.