శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 జనవరి 2017 (12:22 IST)

'గౌతమిపుత్ర శాతకర్ణి'లో గొప్ప కథలేదన్నది నిజమే... బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి". ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమేకాకుండా, మంచి వసూళ్ళను సైతం రాబడుతోంది. అదేస

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి". ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమేకాకుండా, మంచి వసూళ్ళను సైతం రాబడుతోంది. అదేసమయంలో ఈ చిత్ర కథపై అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. చిత్ర కథలో ఏమాత్రం పస లేదనీ, చిత్రాన్ని యుద్ధ సన్నివేశాలతోనే నింపివేశారనే విమర్శలు లేకపోలేదు. 
 
ఈ విమర్శలపై హీరో బాలకృష్ణ స్పందించారు. సినిమా మొత్తాన్ని యుద్ధ సన్నివేశాలతోనే నింపేశారని, క్రిష్‌ మార్క్‌ కథగాని, డ్రామాగాని లేవని విమర్శకులు చేస్తున్న వ్యాఖ్యలు నిజమేనని చెప్పారు. ‘‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో గొప్ప కథ లేదన్నది వాస్తవమే. అయినప్పటికీ ఉన్నంతలో శాతకర్ణి గురించి గొప్పగా చెప్పే ప్రయత్నం చేశాం. ఇలాంటి చారిత్రక నేపథ్యంతో మరో సినిమా చేయమని జనాలు అడుగుతున్నారు. సరైన స్క్రిప్టు వస్తే తప్పకుండా చేస్తానని బాలకృష్ణ ప్రకటించారు.