సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 జూన్ 2024 (20:12 IST)

స్వల్ప అస్వస్థతకు గురైన నిర్మాత బండ్ల గణేష్‌.. కౌంటింగ్ వేళ ఏమైంది?

Bandla Ganesh
Bandla Ganesh
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బండ్ల గణేష్ ప్రస్తుతం అపోలోలో చికిత్స తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో బండ్ల గణేష్ ఆస్పత్రి పాలవడం పట్ల ఆయన ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ గెలిచే అవకాశాలున్నాయి. 
 
ఇక ఎగ్జిట్ పోల్స్ వైకాపాకు సానుకూలంగా స్పందించాయి. మరికొన్ని వైకాపాకు కాకుండా కూటమికి ఓటేశాయి. ఈ అంచనాల మధ్య జూన్ 4న ఎన్నికల ఫలితాలు తేలిపోనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ అభిమాని అయిన బండ్ల గణేష్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. 
 
గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయవద్దని ఆయన అభిమాని, సినీ నిర్మాత బండ్ల గణేష్ ముఖ్యమంత్రి జగన్, ఆ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.