మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 మార్చి 2024 (22:08 IST)

అపోలోలో అజిత్ కుమార్.. నాలుగు గంటల పాటు మెదడుకి శస్త్రచికిత్స?

Ajith
Ajith
తమిళ అగ్ర హీరో అజిత్ కుమార్ ఆస్పత్రి పాలయ్యారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అజిత్ కుమార్ మగియ్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మాణంలో విడాముయర్చి చిత్రంలో నటిస్తున్నాడు. 
 
ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో అజిత్ ఆస్పత్రిలో చేరారు. అజిత్ చెకప్ కోసం వెళ్లినట్లు అజిత్ సన్నిహితులు అంటున్నారు. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అయితే అజిత్ మెదడులో శస్త్రచికిత్స జరిగినట్లు సమాచారం వస్తోంది. 
 
నాలుగు గంటల పాటు జరిగిన ఈ శస్త్రచికిత్సలో అజిత్ మెదడులోని కణితిని తొలగించినట్లు సమాచారం. మదురై, కేరళ నుంచి వచ్చిన ఇద్దరు డాక్టర్లు అజిత్‌కు శస్త్రచికిత్స చేయించినట్లు తెలుస్తోంది.