గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2024 (17:56 IST)

బాపు నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో చిత్రం

Bapu first look
Bapu first look
డార్క్ కామెడీ-డ్రామా, హ్యుమర్, ఎమోషన్స్ యూనిక్ బ్లెండ్ తో  ప్రేక్షకులను అలరించేందుకు 'బాపు చిత్రం రూపొందుతోంది. బ్రహ్మాజీ లీడ్ రోల్స్ లో ఒకరుగా నటిస్తున్న ఈ చిత్రానికి దయా దర్శకత్వం వహిస్తున్నారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీర్ పై రాజు, సిహెచ్‌ భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కథలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
ఈరోజు హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి 'బాపు' ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. పోస్టర్‌లో హాయిగా డైనింగ్ చైర్‌లో కూర్చున్న ఓ తండ్రి చుట్టూ ఒక కుటుంబం గుమిగూడి, అతనికి ఇష్టమైన వంటకాలను వడ్డించడం కనిపిస్తోంది, ఫ్యామిలీ మెంబర్స్ డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ తో కనిపించడం ఆసక్తికరంగా వుంది.
 
బాపు నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఓ వ్యవసాయ కుటుంబం యొక్క ఎమోషనల్ జర్నీగా వుంటుంది. ఓ కుటుంబ సభ్యుడు ఇతరుల మనుగడ కోసం తమ జీవితాన్ని త్యాగం చేయవలసి వచ్చినప్పుడు ఫ్యామిలీ డైనమిక్స్ ఎలా మారుతుందో డార్క్ కామెడీ, హ్యుమర్, ఎమోషనల్ గా హత్తుకునే నెరేటివ్ తో సినిమా ఉండబోతోంది.
 
కొంత గ్యాప్ తర్వాత బ్రహ్మాజీ  లీడ్ రోల్ లో నటించడంతో 'బాపు'పై ఎక్సయిట్మెంట్ మరింతగా పెరిగింది. బ్రహ్మాజీతో పాటు ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్ వంటి అనుభవజ్ఞులైన నటులను కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ మంచి ఎమోషనల్ ఇంపాక్ట్ తో ఉంటుంది.
 
ఈ చిత్రానికి వాసు పెండెం డీవోపీగా పని చేస్తున్నారు. RR ధృవన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అనిల్ ఆలయం ఎడిటర్.