మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 13 నవంబరు 2024 (17:42 IST)

రాజన్న చిత్రంలోని బాలనటి యాని కథానాయికగా జి.పి.ఎల్.

Rajanna fame yani
Rajanna fame yani
అక్కినేని నాగార్జున 2011లో నటించిన రాజన్న సినిమాలో బాలనటిగా నటించిన యాని ఇప్పడు కథానాయికగా మారింది. జి.పి.ఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) టైటిల్ తో నేడు హైదరాబాద్ లో చిత్రం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. అల్లు ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అల్లు లత  సమర్పణలో అల్లు సాయి లక్ష్మణ్ నిర్మాతగా రావు జి.ఎం నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
 
పవన్ శంకర్, యాని,  తనికెళ్ళ భరణి, హెబ్బ పటేల్, బ్రహ్మాజీ, నాగ మహేష్ , నవీన్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. లవ్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా హైదరాబాద్ మరియు వైజాగ్, కోడై కెనాల్ లో జరగనుంది. నవంబర్ 14 నుండి మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది. 
 
డైరెక్టర్ రావు జి.ఎం.నాయుడు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాను. జి.పి.ఎల్ (గాడ్స్ ప్రీమియర్ లీగ్) టైటిల్ ఈ కథకు సరిగ్గా సరిపోతుంది... మనం ఏదైనా పైన ఉన్న భగవంతుడి ఆదేశాల మేరకు నడుస్తాము అనే పాయింట్ తో ఈ సినిమా కథాంశం ఉండబోతోందని తెలిపారు.