మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 8 ఏప్రియల్ 2021 (20:26 IST)

క‌రోనావ‌ల్ల "లవ్ స్టోరి" వాయిదా

Love story team
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా "లవ్ స్టోరి". దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న కొవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో "లవ్ స్టోరి" సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
 
నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ మాట్లాడుతూ, "లవ్ స్టోరి" చిత్రాన్ని ఏప్రిల్ 16న విడుదల చేసేందుకు చాలా సంతోషంగా ఎదురుచూశాం. అయితే కొవిడ్ కేసుల పెరుగుదల వల్ల ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మంచి డేట్ చూసి సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.
 
దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.,"లవ్ స్టోరి" సినిమా వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యింది. సినిమా చాలా బాగా వచ్చింది. థియేటర్లో సినిమా ఎప్పుడు చూద్దామా అని వేచి చూశాం. పాండమిక్ తర్వాత వన్ ఇయర్ వేచి చూసి సినిమా విడుదలకు సిద్ధమయ్యాం. రెండు మూడు రోజుల నుంచి కొవిడ్ పరిస్థితి గమనిస్తున్నాం. మేము అనుకున్న ఏప్రిల్ 16వ తేదీకి ఈ కేసుల సంఖ్య ఇంకా పెరిగేలా ఉంది. ఇది అందరూ హ్యాపీగా చూడాల్సిన సినిమా. కొవిడ్ వల్ల వాళ్లంతా థియేటర్లకు రాకపోవచ్చు. డిస్ట్రిబ్యూటర్స్ అందరితో మాట్లాడాము. సినిమా రెడీగా ఉంది. వీలైనంత త్వరగా చిత్రాన్ని విడుదల చేస్తాం. మొత్తం టీమ్ అంతా ఉత్సాహంగా సినిమా రిలీజ్ కోసం వేచి చూస్తున్నాం. మ్యూజికల్ గా "లవ్ స్టోరి" ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది. అంతటా పాజిటివ్ వైబ్స్ ఉంది. రైట్ టైమ్ కోసం చూస్తున్నాం. అన్నారు.
 
హీరో నాగ చైతన్య మాట్లాడుతూ...పది రోజుల క్రితం శేఖర్ గారు నాకు సినిమా చూపించారు. "లవ్ స్టోరి" సినిమా చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చారు, ఏప్రిల్ 16 ఎప్పుడు రాబోతుంది, ఆడియెన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందనే మైండ్ సెట్ లో ఉన్నాను. దురదృష్టవశాత్తూ గత పది రోజుల్లో పరిస్థితి మారిపోయింది. కరోనా అనేది బాగా వ్యాపిస్తూ ఉంది. కాబట్టి అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఇలాంటి పరిస్థితిలో సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదు అనుకున్నాం. నా సినిమాలు, శేఖర్ గారి సినిమాలను ఫ్యామిలీ ఆడియెన్స్ చూసి సక్సెస్ ఇచ్చారు. ఇలాంటి టైమ్ లో ఫ్యామిలీస్ వచ్చి సినిమాను చూస్తాయని ఆశించడం తప్పు. ఆరోగ్యం అనేది ముఖ్యం. పరిస్థితులు బాగుపడ్డాక మంచి డేట్ చూసి మీ ముందుకొస్తాం. "లవ్ స్టోరి" టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్. ఇంకా చాలా కంటెంట్ సినిమాలో ఉంది. "లవ్ స్టోరి" కంటెంట్ ను నేను చాలా బలంగా నమ్ముతున్నాను. కాస్త ఆలస్యంగా వచ్చినా మంచి కంటెంట్ ను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తాననే నమ్మకం ఉంది. ఒక సినిమా పూర్తయ్యాక దాన్ని అలా ఆపి ఉంచాలంటే చాలా ప్యాషన్ కావాలి. అలాంటి ప్యాషన్ ఉన్న మా నిర్మాతలు నారాయణ దాస్ నారంగ్, సునీల్ గారు, పి రామ్మోహన్ గారికి థాంక్స్. కరోనా నిబంధనలు పాటించమని ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.
 
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ''లవ్ స్టోరి'' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు.
 
సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్ : మార్తాండ్ కె.వెంకటేష్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి, పిఆర్ఓ : జి.ఎస్.కె. మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు, రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.