సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 9 మే 2023 (18:14 IST)

నార్త్ లో శ్రీనివాస్ కు వస్తున్న ఆదరణ చూసి తండ్రిగా గర్వపడుతున్నా: బెల్లంకొండ సురేష్

Bellamkonda Suresh, vinayak
Bellamkonda Suresh, vinayak
డైనమిక్ హీరో శ్రీనివాస్ బెల్లంకొండ, స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్‌లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ ‘ఛత్రపతి’ తో బాలీవుడ్‌లో గ్రాండ్ డెబ్యూ చేస్తున్నాడు.  రాజమౌళి బ్లాక్‌బస్టర్ ఛత్రపతికి రీమేక్ గా అదే టైటిల్ తో ఈ చిత్రాన్ని గ్రాండ్ తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యాయి. సినిమా ఈ నెల 12న విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్  విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ.. మంచి కథని అందించిన విజయేంద్ర ప్రసాద్ గారికి ముందుగా నా కృతజ్ఞతలు. రాజమౌళి గారు, ప్రభాస్ ఛత్రపతి ని అద్భుతంగా చేశారు. వారు చేసిన దానిని పాడు చేయకుండా ఐకానిక్ సీన్స్ షాట్స్ ఏమీ మార్చకుండా చాలా జాగ్రత్తగా చేశాం. ఏదైనా చిన్న మార్పు వున్నా ప్రసాద్ గారితో మాట్లాడి చాలా జాగ్రత్తగా చేశాం. సాయి సినిమాన్నీ నార్త్ లో బాగా ఆడాయి. ఆ నమ్మకంతో పెన్ స్టూడియో గడా గారు ఈ సినిమా చేశారు. బెల్లం కొండ సురేష్ గారు  మాకు బ్యాక్ బోన్. ఆయనకి సినిమా అంటే ప్యాషన్ . డబ్బు గురించి గానీ  మరొకదాని గురించి అలోచించరు. ఈ సినిమా రావడానికి మా టీం అంతా ఎంతో సహకరించారు. సాయి అద్భుతంగా చేశాడు. ఇంటర్వెల్ సీన్ లో , యాక్షన్ సీన్స్ లో సాయి ని నటన చూసి ఆశ్చర్యపోయాను. తనని పరిచయం చేసింది నేనే. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. సాయినే ఇంత పరిణితితో ఇంత బగా చేస్తున్నాడని అనిపించింది. సాయి చాలా పెద్ద హీరోగా హిందీలో నిలబడతాడు. గడా గారు మరో రెండు సినిమాలు సాయితో చేయడం చాలా అనందంగావుంది. రాజమౌళిగారికి, ప్రభాస్ కి, విజయేంద్ర ప్రసాద్ గారికి, సురేష్ గారికి మరోసారి కృతజ్ఞతలు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే ఆశతో వున్నాను. సక్సెస్ తర్వాత ఇంకా పెద్ద ఈవెంట్ నిర్వహిస్తాం’’ అన్నారు.
 
బెల్లం కొండ సురేష్ మాట్లాడుతూ.. అరవై కోట్లు తో పెన్ పెన్ స్టూడియోస్‌ లాంటి నిర్మాణ సంస్థ మా అబ్బాయితో సినిమా చేయడం తండ్రి నేను ఎంతో గర్వపడే విషయం. నార్త్ లో చాలా అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నారు. హిందీలో నేను చేసినా ఇంత బాగా ప్రమోట్ చేయలేనేమో. ఎక్కడికి వెళ్ళిన అద్భుతమైన  రెస్పాన్స్ వస్తోంది. తన సినిమాలని నార్త్ ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకోవడం వలనే ఎక్కడివెళ్ళిన ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. మాస్ పల్స్ తెల్సిన వినాయక్ గారు హిందీలో కూడా ఆ అబ్బాయిని లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఇది తెలుగు లో కూడా డబ్ చేయొచ్చు. కానీ హిందీలో తీసిన సినిమాని హిందీలో చూపిద్దామని వినాయక్ గారు అన్నారు. మన తెలుగు ఆడియన్స్ కూడా మన హీరో హిందీ లో ఎలా చేశాడో అని చూస్తారు. ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు