1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2016 (19:24 IST)

నటి నగ్న చిత్రాలు నెట్లో హల్ చల్... రంగంలోకి దిగిన పోలీసులు

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన నటీమణులు వ్యభిచారంలో పట్టుబడటం సర్వసాధారణంగా మారిపోయింది. కనీసం నెలకో ఇద్దరు ముగ్గురైనా ఈ వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. తాజాగా బెంగాలీ నటి మధుమిత చక

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన నటీమణులు వ్యభిచారంలో పట్టుబడటం సర్వసాధారణంగా మారిపోయింది. కనీసం నెలకో ఇద్దరు ముగ్గురైనా ఈ వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. తాజాగా బెంగాలీ నటి మధుమిత చక్రవర్తి గోవాలో వ్యభిచారం చేస్తూ పట్టుబడిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. 
 
ఇదిలావుంటే... మార్ఫింగ్ చేసిన తన నగ్న చిత్రాలను వెబ్ పేజీలో పోస్ట్ చేశారంటూ ఈ నటి కోల్‌క‌త్తా పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. మ‌ధుమిత ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటర్నెట్‌లో మధుమితకు సంబంధించిన 100 మార్ఫెడ్ ఫొటోలను గుర్తించారు. బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తులే రెండు వేర్వేరు ఫోటోలను తీసుకుని ఈ మార్ఫింగ్‌కు పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. 
 
త్వ‌ర‌లోనే నిందితుల‌ను ప‌ట్టుకుంటామ‌ని పోలీసులు అంటున్నారు. అయితే ఇపుడీ విషయం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. పోలీసు ఫిర్యాదు వరకు వెళ్లకుంటే.. అవి నటి మధుమిత చక్రవర్తి అసలైన నగ్న చిత్రాలేనని భావించే అవకాశాలు చాలావరకు ఉండేవని అధికారులు అంటున్నారు. చివరికి అవి మార్ఫింగ్ పిక్స్ అని తేలడంతో మధుమితకు కొంత ఊరట లభించినట్టయింది.