శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 13 మే 2018 (17:08 IST)

''భరత్ అనే నేను'' సరికొత్త రికార్డ్.. మూడు వారాల్లో రూ.205 కోట్ల గ్రాస్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు- కొరటాల దర్శకత్వంలో గతంలో రూపుదిద్దుకున్న శ్రీమంతుడు సినిమా నాన్ బాహుబలి రికార్డులను సాధిస్తే.. ''భరత్ అనే నేను'' సినిమా కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సినిమా కలెక్షన్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు- కొరటాల దర్శకత్వంలో గతంలో రూపుదిద్దుకున్న శ్రీమంతుడు సినిమా నాన్ బాహుబలి రికార్డులను సాధిస్తే.. ''భరత్ అనే నేను'' సినిమా కొత్త రికార్డులను సృష్టిస్తోంది.


ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల ఫ్లాప్‌తో.. హిట్ కొట్టాలనుకున్న కసితో వున్న మహేష్ బాబుకి కొరటాల మంచి సినిమా ఇచ్చాడు. భరత్ అనే నేను అనే ఈ సినిమా విడుదలైన తొలిరోజు నుంచే రికార్డుల వేటను కొనసాగించింది.
 
తొలిరోజే రూ. 40 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టిందని నిర్మాత ఇప్పటికే ప్రకటించారు. తొలి వారంలో రూ.161 కోట్లు, రెండు వారాలకు రూ. 190 కోట్ల గ్రాస్‌ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా కొత్త రికార్డును సృష్టించింది.

మూడంటే మూడే వారాల్లో రూ.205 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని సినీ యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం భరత్ అనే నేను సక్సెస్‌తో విదేశాల్లో ఫ్యామిలీ కలిసి ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు.. తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు.