గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 10 మే 2018 (17:22 IST)

"భరత్ అనే నేను" రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంటరయ్యాను....

ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా నటించిన చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఏప్రిల్ 20వ తేదీన విడులైన ఈ చిత్రం సూపర్ హిట

ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ జంటగా నటించిన చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. ఏప్రిల్ 20వ తేదీన విడులైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
 
ఫలితంగా మే 5వ తేదీ నాటికి రూ.190 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయిందని ఫిల్మ్ ట్రేడ్ వర్గాల సమాచారం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, అటు తమిళనాడులో కూడా ఈ చిత్రం కలెక్షన్లను బాగానే రాబడుతోంది. ఈ సినిమా ఈ స్థాయి విజయం సాధించడంతో, బాలీవుడ్ నిర్మాతలు రీమేక్ రైట్స్ కోసం పోటీపడుతున్నారని సమాచారం.
 
అంతకుముందు, బాహుబలి చిత్రం తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రామ్ చరణ్ రంగస్థలం ఉండేది. ఈ చిత్రాన్ని భరత్ అనే నేను చిత్రం అధికమించడమే కాకుండా, సరికొత్త రికార్డులు సష్టించనుంది.