శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: బుధవారం, 9 మే 2018 (21:36 IST)

మ‌హేష్ 25వ సినిమా గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు భ‌ర‌త్ అనే నేను సినిమాతో బ్లాక్‌బ‌ష్ట‌ర్ సొంతం చేసుకుని ఫుల్ హ్యాపీగా ఉన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం భ‌ర‌త్ అనే నేను స‌క్స‌స్ ఎంజాయ్ చేస్తోన్న మ‌హేష్ 25వ సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకి వంశీ పైడి

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు భ‌ర‌త్ అనే నేను సినిమాతో బ్లాక్‌బ‌ష్ట‌ర్ సొంతం చేసుకుని ఫుల్ హ్యాపీగా ఉన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం భ‌ర‌త్ అనే నేను స‌క్స‌స్ ఎంజాయ్ చేస్తోన్న మ‌హేష్ 25వ సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు.  అందుకు సంబంధించిన పనుల్లోనే వంశీ పైడిపల్లి బిజీగా వున్నాడు. 
 
ఈ సినిమాకి సంబంధించిన లొకేషన్ల కోసం తాను అమెరికాలో తిరుగుతున్నట్టుగా ఆయన ఇటీవల ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ సినిమా కథ ప్రకారం షూటింగ్ అమెరికాలోనే ఎక్కువగా జరుగుతుందని చెప్పాడు. దాంతో అమెరికా నేపథ్యంలోనే ఈ కథను సిద్ధం చేశారని మహేష్‌ బాబు అభిమానులు భావించారు. కానీ... ఈ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. 
 
అది ఏమిటంటే... ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో రూపొందనుందనేది తాజా సమాచారం. ఈ తరహా కథను మహేష్‌ ఇంతరవరకూ టచ్ చేయలేదని చెబుతున్నారు. తాజాగా బయటికి వచ్చిన ఈ విషయం .. మహేష్‌ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మ‌రి... త‌న కెరీర్‌లో ముఖ్య‌మైన ఈ సినిమాతో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.