సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 సెప్టెంబరు 2018 (11:32 IST)

డెంగీ జ్వరంతో ఆస్పత్రిపాలైన బాలీవుడ్ కమెడియన్ కపుల్స్

బాలీవుడ్ వెండితెరపై బెస్ట్ కమెడియన్ కపుల్స్‌గా పేరుగాంచిన భారతీ సింగ్, హర్ష్ లింబాచియాలు ఇపుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు.

బాలీవుడ్ వెండితెరపై బెస్ట్ కమెడియన్ కపుల్స్‌గా పేరుగాంచిన భారతీ సింగ్, హర్ష్ లింబాచియాలు ఇపుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. 
 
దీంతో వీరు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరు అబ్జర్వేషన్లో ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. కాగా భారతి త్వరలోనే ఒక టాక్ షో ప్రారంభించనున్నట్లు సమాచారం. దీనితో పాటు ఆమె ఇండియాస్ గాట్ టాలెంట్ షోను హోస్ట్ చేస్తున్నారు.
 
నిజానికి వీరిద్దరూ కొన్ని రోజుల క్రితం బిగ్‌బాస్ కారణంగా వార్తల్లోకి వచ్చారు. టీవీరంగంలో ఆదరణ పొందిన ఈ జోడీ బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేయనున్నారనే వార్తలు వినిపించాయి. అయితే బిగ్‌బాస్ (హిందీ) ప్రారంభానికి ముందే వీరు అనారోగ్యం పాలుకావడంతో బిగ్‌బాస్‍లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.