శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 22 సెప్టెంబరు 2018 (12:32 IST)

టీ సరిగా పెట్టలేదని పనిమనిషితో బ్లీచింగ్ నీళ్లు తాగించిన యజమాని... ఎక్కడ?

పొట్టకూటి కోసం విదేశాలకు వెళుతున్న అనేక మంది పేదలు చిత్రహింసలకు గురవుతున్నారు. ముఖ్యంగా, కంపెనీ యజమానులతో పాటు ఇంటి యజమానులు పెట్టే చిత్ర హింసలు భరించలేక ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు.

పొట్టకూటి కోసం విదేశాలకు వెళుతున్న అనేక మంది పేదలు చిత్రహింసలకు గురవుతున్నారు. ముఖ్యంగా, కంపెనీ యజమానులతో పాటు ఇంటి యజమానులు పెట్టే చిత్ర హింసలు భరించలేక ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. తాజాగా టీ సరిగా పెట్టలేదన్న అక్కసుతో ఓ పని మనిషితో బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగించాడో ఓ ఇంటి యజమాని. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఫిలిప్పైన్స్‌కు చెందిన అగ్నస్ మన్సిల్లా అనే ఓ మహిళ బతుకుదెరువు కోసం పొట్టచేత పట్టుకుని సౌదీఅరేబియాకు వెళ్లి, అక్కడ ఓ ఇంటిలో పని  మనిషిగా చేరింది. ఆ తర్వాత ఆమె దయనీయమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. టీ సరిగా పెట్టకపోవడంతో ఇంటి యజమాని హెచ్చరించాడు. ఆ తర్వాత అదే తప్పు పదేపదే చేస్తున్నావంటూ యజమాని ఆగ్రహించాడు. 
 
వెంటనే పనిమనిషితో బలవంతంగా బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగించగ ఆమె సృహతప్పిపడిపోయింది. దీంతో భయపడిన నిందితుడు పోలీసులకు సమాచారం అందించడంతో బాధితురాలిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నేరం రుజువైతే నిందితుడు శిక్షను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. జరిమానా, జైలుశిక్షతోపాటు కొరఢా దెబ్బలు కూడా కొట్టే అవకాశాలున్నాయని పోలీసులు పేర్కొన్నారు.