గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (10:42 IST)

బాలీవుడ్ హీరో దిలీప్ కుమార్‌కు అనారోగ్యం.. ఆస్పత్రిలో చేరిక

బాలీవుడ్ హీరో దిలీప్ కుమార్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఆయన అభిమానులు త్వ‌ర‌గా కోలు

బాలీవుడ్ హీరో దిలీప్ కుమార్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఆయన అభిమానులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని పూజ‌లు చేస్తున్నారు. కొంద‌రు ఆయ‌న ఆరోగ్యంపై ఆరాలు తీస్తున్నారు. దీంతో దిలీప్ భార్య సైరా భాను క్లారిటీ ఇచ్చారు.
 
తన భర్త దిలీప్ కుమార్ ఛాతిలో తేలిక‌పాటి న్యూమోనియాని వైద్యులు గుర్తించారు. ఈ వైద్యానికి దిలీప్ స‌హ‌క‌రిస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే ఆయ‌న‌ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయ‌నున్నారు అని తెలిపారు. దిలీప్ 1994లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును, 2015లో పద్మ విభూషణ్ అవార్డులను స్వీకరించారు. దేవదాస్, మొఘల్ ఏ ఆజమ్, గంగా జమునా, కర్మా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో దిలీప్ నటించారు.