సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 జూన్ 2017 (16:30 IST)

ఆత్మహత్య చేసుకున్న నటి అంజలి...

ఇటీవలికాలంలో నటీనటులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాగా అంజలి శ్రీవాస్తవ్ అనే నటి ఆత్మహత్య చేసుకుంది. ఈమె భోజ్‌పురికి చెందిన సినీ నటి. 29 యేళ్ళ అంజలి ముంబైలోని తన నివాసంలో ఫ్యానుకు చీరతో ఉరివేసుకుంది.

ఇటీవలికాలంలో నటీనటులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాగా అంజలి శ్రీవాస్తవ్ అనే నటి ఆత్మహత్య చేసుకుంది. ఈమె భోజ్‌పురికి చెందిన సినీ నటి. 29 యేళ్ళ అంజలి ముంబైలోని తన నివాసంలో ఫ్యానుకు చీరతో ఉరివేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
భోజ్‌పురికి చెందిన అంజలి శ్రీవాత్సవ్... ముంబైలోని జుహు రోడ్‌లోని ప‌రిమ‌ల్ సొసైటీలోని ఓ అపార్టుమెంట్‌లో నివశిస్తోంది. ఈమె ఫ్యానుకు ఉరివేసుకుని చనిపోయినట్టు మంగళవారం పోలీసులు గుర్తించారు. ఇంటి యజమానులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ విషయాన్ని కనుగొన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే దానిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. 
 
అంజలి తాజాగా ‘కెహు తా దిల్ మే బా’ చిత్రంలో నటించగా గతంలో ‘గోపాల్ రాయ్, ఆదిత్య కశ్యప్, రాజా, ప్రేమ్ దూబే’ వంటి చిత్రాల్లో ప్రముఖ పాత్రలు పోషించింది. జూన్ 6న అంజ‌లి త‌న ఫేస్‌బుక్‌లో చివ‌రిగా పోస్ట్ పెట్టింది. త‌న త‌ల్లితండ్రుల‌కు పెళ్లి రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఓ వీడియో కూడా షేర్ చేసింది. 
 
అయితే, ఆమె మృతిపై తల్లి సందేహం వ్యక్తం చేస్తోంది. తన కుమార్తెను చంపేసి ఉంటారని ఆరోపిస్తుంది. పైగా, తన కుమార్తె ఆత్మహత్యకు ప్రేరేపించేటంతటి కారణాలు ఏవీ లేవని చెపుతోంది.