మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శనివారం, 25 ఆగస్టు 2018 (21:43 IST)

బిగ్ బాస్‌లో కెప్టెన్‌గా దీప్తి - ఈ వారం ఎలిమినేషన్ ఎవరో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లోని సభ్యులందరూ కలిసి కౌశల్‌ను కాల్ బాక్ చేశారు. దీప్తితో కలిసి కౌశల్ పోటీ పడితే అమిత్ మినహా ఇంట్లో ఉన్న సభ్యులందరూ దీప్తికే మద్ధతు తెలిపారు. దీంతో సీజన్ ఆరంభం నుంచి కెప్టెన్సీ టాస్క్‌లో మొదటి నుంచి ఓడిపోతూ వచ్చిన దీప్తి తొలిసారి ఇంటి

బిగ్ బాస్ హౌస్ లోని సభ్యులందరూ కలిసి కౌశల్‌ను కాల్ బాక్ చేశారు. దీప్తితో కలిసి కౌశల్ పోటీ పడితే అమిత్ మినహా ఇంట్లో ఉన్న సభ్యులందరూ దీప్తికే మద్ధతు తెలిపారు. దీంతో సీజన్ ఆరంభం నుంచి కెప్టెన్సీ టాస్క్‌లో మొదటి నుంచి ఓడిపోతూ వచ్చిన దీప్తి తొలిసారి ఇంటి కెప్టెన్ అయ్యింది.
 
బిగ్ బాస్‌లోని సభ్యులలో ఎవరితోను తాను బంధం కలుపుకోనని, తాను ఒంటరినంటూ కౌశల్ చెప్పుకోవడం అతని కెప్టెన్సీ అవకాశాన్ని దారుణంగా దెబ్బతీసింది. కెప్టెన్సీగా నిలిచేందుకు సభ్యులకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. సైరన్ మోగిన వెంటనే వేగంగా సోఫాపై వెళ్ళి కూర్చున్న ఇద్దరు ఇంటి సభ్యులు పోటీలో ఉంటారని వెల్లడించారు. ఈ పోటీలో కౌశల్, దీప్తితో పాటు పూజా రామచంద్రన్, సామ్రాట్ వెళ్ళి కూర్చున్నారు.
 
కానీ వేగంగా ముందుకు వెళ్ళిన కౌశల్, దీప్తి చివరకు కెప్టెన్సీ టాస్క్‌లో నిలిచారు. ఈ సమయంలోనే పూజా రామచంద్రన్‌తో కౌశల్ కాసేపు గొడవపడ్డాడు. ఆ తరువాత తుది పోటీలో భాగంగా గార్డెన్ ఏరియాలో వేయింగ్ మిషన్ అమర్చిన బిగ్ బాస్ తాము మద్థతు తెలపాలనే పోటీదారుని తమ వస్తువులను త్యాగం చేయాలో చెప్పాలన్నారు. ఈ పోటీలో అమిత్ మినహా దీప్తికి మిగిలిన అందరూ వస్తువులను త్యాగం చేశారు. దీంతో టాస్క్ ముగిసే సరికి దీప్తికి 5కేజీల 800గ్రాముల బరువైన వస్తువులు రాగా కౌశల్ కు కేవలం మూడుకేజీల 900గ్రాముల వస్తువులు మాత్రమే వచ్చాయి. అది కూడా అన్నీ అమిత్ వేసినవే.
 
సభ్యులు వేసిన ఈ వస్తువులను బిగ్ బాస్ స్టోరూంలో పెట్టి భద్రపరిచారు. బహుశా ఆ సభ్యుడికి హౌస్ లో ఉన్నన్ని రోజులు అవి తిరిగిరాకపోవచ్చు. ఇక బిగ్ బాస్‌లో గత వారం పోటీ పడి చివరకు బయటకు వెళ్ళిపోయిన  నూతన నాయుడు సర్‌ప్రైజింగ్‌గా ఇంట్లోకి మళ్ళీ ప్రవేశించాడు. దీంతో అతని పునరాగమనాన్ని కౌశల్ మినహా మిగిలిన సభ్యులందరూ పెదవి విప్పారు. అతను చికిత్స కోసం గత వారం ఎలిమినేషన్‌తో పాటు ఈ వారం నామినేషన్ నుంచి తప్పించుకున్నాడని తనీష్ మండిపడ్డాడు.
 
అతను బాధను పరోక్షంగా తన ఆప్తమిత్రురాలైన దీప్తి సునయన గత వారం వెళ్ళిపోవడమేనని అందుకే తనీష్ అలా చేస్తున్నాడని సభ్యులకు అర్థమైంది. ఒకవేళ దీప్తి నాయుడు ఉండి ఉంటే దీప్తి సునయన ఉండి ఉండేదని సభ్యులతో చెబుతూ తనీష్ కాసేపు బాధపడ్డాడు. ఈ వారం కౌశల్, తనీష్, పూజారామచంద్రన్, దీప్తిలు ఎలిమినేషన్స్ కోసం నామినేషన్స్‌లో ఉన్నారు.