శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: సోమవారం, 30 జులై 2018 (19:02 IST)

బిగ్ బాస్‌ ఓట్ల మాయాజాలం... యాంకర్ శ్యామల వచ్చేస్తుందని ముందే తెలుసు...

బిగ్ బాస్ షోలో కోట్లకు కోట్లు ఓట్లు వస్తున్నట్లు నాని చెబుతున్నారు. ఈ వారం తిరిగి ఇంటిలోకి పంపడానికి ఆరుగురు మాజీ సభ్యులకు 11 కోట్ల ఓట్లు వచ్చినట్లు గొప్పగా చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఒక్కరు కూడా తప్పక

బిగ్ బాస్ షోలో కోట్లకు కోట్లు ఓట్లు వస్తున్నట్లు నాని చెబుతున్నారు. ఈ వారం తిరిగి ఇంటిలోకి పంపడానికి ఆరుగురు మాజీ సభ్యులకు 11 కోట్ల ఓట్లు వచ్చినట్లు గొప్పగా చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఒక్కరు కూడా తప్పకుండా ఓట్లు వేసినా అన్ని ఓట్లు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే…. ప్రపంచంలో తెలుగు మాట్లాడగలిగే వారి సంఖ్య 12 కోట్లుగా అంచనా. తమిళనాడులో చాలామందికి తెలుగు మూలాలున్నా తెలుగు తెలిసినా… తెలుగు ఛానళ్లు చూసే అంతటి అవకాశం వుండదనే చెప్పాలి. 
 
అసలు తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ షో చూస్తున్నవారు ఎంతమంది… చూసేవారిలో ఓట్లు వేసేది ఎందరు… అనేది ప్రశ్న. అయినా ఈ వారం 11 కోట్ల ఓట్లు వచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో బిగ్ బాస్ మాయ ఉంది. ఒకరు ఓటు వేస్తే 50 ఓట్లు లెక్క. ఆన్ లైన్‌లో ఓటు వేసేందుకు ప్రయత్నిస్తే… ఒక బార్ వస్తుంది. ఆ బార్‌లోని మార్క్‌కు జరపడం ద్వారా యాభై ఓట్లు వేయవచ్చు. సాధారణంగా నచ్చిన వారికి అన్ని ఓట్లు వేస్తుంటారు. ఆ విధంగా వచ్చినవి 11 కోట్ల ఓట్లు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ లెక్కన ఈ వారం 22 లక్షల మంది మాత్రమే ఓట్లు వేసినట్లు భావించాలి.
 
బిగ్ బాస్ ఇంకో మాయాజాలం ఏమంటే ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పకపోవడం. బిగ్ బాస్ షోకు సమాంతరంగా కొన్ని అనధికార సైట్లు కూడా ఓటింగ్ నిర్వహిస్తుంటాయి. ఈ సైట్లలో వచ్చే ఓట్లకు, బిగ్ బాస్ ప్రకటించే ఓట్లకు పొంతన ఉండటం లేదు. ప్రైవేట్ ఓటింగులో ఒకరికి ఎక్కువ ఓట్లు వస్తే అధికారిక ప్రకటనలో ఇంకొకరికి ఎక్కువ ఓట్లు వచ్చినట్లు చెబుతుంటారు. ఆఖరుగా చెప్పేదేమంటే… బిగ్ బాస్ ఓట్లను పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఇదిలావుంటే యాంకర్ శ్యామల తిరిగి బిగ్ బాస్ ఇంటికి వచ్చేసింది. అనుకున్నట్లే వాళ్లబ్బాయికి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుని వచ్చిందని చెప్పుకుంటున్నారు.