గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (11:22 IST)

అట్టహాసంగా బిగ్‌బాస్ కంటిస్టెంట్ మానస్ వివాహం

Maanas Nagulapalli
Maanas Nagulapalli
సీరియల్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న మానస్ బిగ్‌బాస్ కంటిస్టెంట్ అయిన సంగతి తెలిసిందే. పలు సినిమాలలో కూడా మానస్ నటించాడు. ప్రస్తుతం మానస్ పలు సీరియల్స్, ప్రైవేట్ ఆల్బమ్స్, టీవీ షోలతో బిజీగా ఉన్నాడు. శ్రీజ అనే విజయవాడకు చెందిన అమ్మాయితో మానస్ ఎంగేజ్మెంట్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. 
 
తాజాగా మానస్ ఓ ఇంటివాడయ్యాడు. విజయవాడలోని మురళీ రిసార్ట్స్ వేదికగా నిన్న నవంబర్ 22 బుధవారం రాత్రి మానస్ - శ్రీజల వివాహం ఘనంగా జరిగింది. 
 
ఇరు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, పలువురు సినీ, టీవీ ప్రముఖుల మధ్య వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.