ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 19 నవంబరు 2016 (13:06 IST)

షూటింగ్‌లో బిగుసుకున్న ఉరితాడు.. కట్ చెప్పని డైరక్టర్... కేకలు పెడుతుంటే కాపాడిన యూనిట్!

సాధారణంగా సినిమా షూటింగ్‌లో చిన్నపాటి అపశృతులు చోటుచేసుకోవడం సహజం. వీటిలో కొన్ని... అపశృతులు విషాదకరంగా ముగుస్తాయి కూడా. ఇలాంటి ఘటన ఒకటి తాజాగా జరిగింది. ప్రిన్స్ నరుల అనే నటుడు బుల్లితెరపై నటుడిగా రా

సాధారణంగా సినిమా షూటింగ్‌లో చిన్నపాటి అపశృతులు చోటుచేసుకోవడం సహజం. వీటిలో కొన్ని... అపశృతులు విషాదకరంగా ముగుస్తాయి కూడా. ఇలాంటి ఘటన ఒకటి తాజాగా జరిగింది. ప్రిన్స్ నరుల అనే నటుడు బుల్లితెరపై నటుడిగా రాణిస్తున్నాడు. బిగ్ బాస్ షో విన్నర్ కూడా. 
 
ఓ షో కోసం ప్రిన్స్ ఉరివేసుకుంటున్న దృశ్యం చిత్రీకరిస్తుండగా, ప్రమాదవశాత్తూ మెడకు బిగుసుకున్న ఉరి దాదాపు ఆయన ప్రాణాలను తీసినంత పని చేసింది. కాలు కింద ఉన్న కుర్చీ పక్కకు జరగడంతో ప్రిన్స్ మెడకు ఉరి బిగుసుకుంది. డైరెక్టర్ కట్ చెప్పలేదు. 
 
అదేసమయంలో ఆ తాడు అతని మెడకు గట్టిగా బిగుసుకోవడంతో కేకలు పెడుతున్న ప్రిన్స్‌ను యూనిట్ సిబ్బంది పరుగున వెళ్లి కాపాడారు. మెడ చుట్టూ స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డాడు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ.. కాలు కింద ఉన్న కుర్చీ పక్కకు జరగడంతో చాలా భయపడ్డానని చెప్పాడు. ఈ సీన్ అభిమానులకు థ్రిల్ కలిగిస్తుందని అన్నాడు.