మాల్దీవుల్లో మస్తుగా ఎంజాయ్ చేస్తున్న బిపాసా బసు

Maldives
సెల్వి| Last Updated: మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (11:28 IST)
Maldives
బెంగాళీ భామ బిపాసా బసు 'టక్కరి దొంగ' సినిమాలో మహేష్ సరసన మెరిసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.

అయితే హిందీలో హాట్ హాట్‌గా... జిస్మ్, ధూమ్ సినిమాల్లో అదరగొట్టింది. అవకాశాలు తగ్గడంతో ఆ మధ్య మోడల్ కరన్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లి చేసుకుని సెట్లైంది. ప్రస్తుతం బిపాసా తన భర్తతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది.

ఇప్పటికే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే బిపాసా బసు.. మంగళవారం (ఫిబ్రవరి 23) పుట్టినరోజు కావడంతో మాల్దీవుల్లో ఎంజా చేస్తోంది. భర్తతో కలిసివున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Love is in the air #loveyourself పేరిట నోట్ రాసి మాల్దీవుల్లో భర్తతో వున్న ఫోటోలను షేర్ చేసింది బిపాసా బసు.దీనిపై మరింత చదవండి :