నా హనీమూన్ ఎలా జరిగితే మీకేంటి? వాటిలోని కళను చూడండి! : బిపాసా బసు హాట్ కామెంట్స్
బాలీవుడ్ హాట్ నటి బిపాసా బసు ఇటీవలే కొత్త పెళ్లికూతురు అయింది. కరణ్ సింగ్ గ్రోవర్‌ను ఈ ముద్దుగుమ్మ వివాహం చేసుకోగా, ప్రస్తుతం ఈ జంట మాల్దీవుల్లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, తన పడక గదిలో జరిగే విషయాలను రోజుకో విధంగా కళల రూపంలో ఆమె వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా.. టవల్స్, దుప్పట్లతో చిత్ర విచిత్ర బొమ్మలను తయారుచేసి.. వాటిని ఫోటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తోంది. దీనిపై విమర్శలు చెలరేగుతున్నాయి.
ఇలా ప్రైవేట్ చిత్రాలను అందరికీ చూపడం ఏంటని విమర్శలు వెల్లువెత్తుతుండటంతో, కాస్తంత ఘాటుగానే స్పందించిందీ కొత్త పెళ్లి కూతురు. తాను పెడుతున్న పోస్టుల్లో టవల్ ఆర్ట్ ఉందని, ఓ టవల్, బ్లాంకెట్లను అందమైన హంసలుగా, మానవ రూపాల్లో, కోతిలా, కుందేలులా చుట్టి మడతలు పెట్టడం అంత సులువు కాదని చెబుతోంది. కళను చూడకుండా విమర్శలు ఏంటని క్లాస్ పీకింది. తనకు టవల్ ఆర్ట్ ఎంతో నచ్చిందని, వీటి ఫోటోలు మరిన్ని పెడతానని చెప్పింది. నేను ఎలా ఉన్నా.. ఎలాంటి డ్రెస్ వేసుకున్నా.. నా హనీమూన్ ఎలా జరిగినా మీకెందుకంటూ నెటిజన్లపై విరుచుకుపడింది.