శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 జులై 2024 (12:55 IST)

కియారా అద్వానీ పుట్టిన రోజు.. గేమ్ ఛేంజర్ కలర్ ఫుల్‌ ఫోటో రిలీజ్

Game Changer
Game Changer
గేమ్ ఛేంజర్ నుంచి కియారా అద్వానీ ఫోటో రిలీజైంది. ఈ ఫోటో కలర్ ఫుల్‌గా కనిపించింది. కియారా అద్వానీకి నేడు పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమె పోస్టర్‌ను సినీ యూనిట్ విడుదల చేసింది. టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. 
 
రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పొలిటికల్ డ్రామా చాలా కాలం క్రితం ప్రారంభమైంది. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని దిల్ రాజు ఇటీవల వెల్లడించారు.  
 
కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి కథను అందించగా, తిరునావుక్కరసు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తుండగా థమన్ సంగీతం అందించాడు. రచయితల విభాగంలో ఎస్‌యూ వెంకటేశన్, వివేక్ కూడా ఉన్నారు. 
 
ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, అంజలి, సముద్రఖని, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ పొలిటికల్ డ్రామాకి దిల్ రాజు నిర్మాత.