మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 28 జూన్ 2017 (17:48 IST)

బేబీ బంప్‌తో బికినీలో సెలీనా జైట్లీ... ఆనందంలో ఇలా షేర్ చేసింది...

బాలీవుడ్ సినీ నటిగా పేరు తెచ్చుకున్న సెలీనా జైట్లీ మళ్లీ గర్భవతి అయ్యింది. తను గర్భవతిననీ, ఈసారి కూడా తనకు కవలలు పుట్టబోతున్నారంటూ ఆమె తన బేబీ బంప్ తో బికినీలో ఫోటోను షేర్ చేసింది. కాగా ఆమె ఐదేళ్ల కిందట తొలి కాన్పులో ఆమె కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలి

బాలీవుడ్ సినీ నటిగా పేరు తెచ్చుకున్న సెలీనా జైట్లీ మళ్లీ గర్భవతి అయ్యింది. తను గర్భవతిననీ, ఈసారి కూడా తనకు కవలలు పుట్టబోతున్నారంటూ ఆమె తన బేబీ బంప్ తో బికినీలో ఫోటోను షేర్ చేసింది. కాగా ఆమె ఐదేళ్ల కిందట తొలి కాన్పులో ఆమె కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికీ విన్‌స్టన్, విరాజ్‌లుగా పేర్లు పెట్టుకున్నారు.
 
కాగా మళ్లీ తనకు కవల పిల్లలు పుట్టబోతున్నారని వైద్యులు చెప్పారనీ, ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా వుందంటూ పేర్కొంది. తల్లి కావడం తనకు అనిర్వచనీయమైన అనుభూతి అనీ చెప్పిన సెలీనా మరోమారు తన కవల పిల్లల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పింది.