శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2017 (15:23 IST)

శివగామి చెప్తే.. బాహుబలిని కట్టప్ప చంపేశాడా?

బాహుబలి సినిమా రిలీజైనప్పటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రశ్న.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనేదే. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఈ నెల 28న రిలీజయ్యే బాహుబలి ది కన్‌క్లూజన్ చూడాల్సిందే.. అంటున

బాహుబలి సినిమా రిలీజైనప్పటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రశ్న.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనేదే. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఈ నెల 28న రిలీజయ్యే బాహుబలి ది కన్‌క్లూజన్ చూడాల్సిందే.. అంటున్నారు జక్కన్న టీమ్. ఈ చిత్రంలో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు వేయి కనులతో ఎదురుచూస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నకు ఎంతో మంది ఎన్నో రకాలుగా విశ్లేషణాత్మకమైన సమాధానాలను చెప్పారు. కానీ, అసలైన వాస్తవమేంటో మాత్రం బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో, ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. బాహుబలిని హత్య చేయాలని కట్టప్పను శివగామి ఆదేశించిందని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
 
బాహుబలికి వ్యతిరేకంగా భల్లాలదేవ, బిజ్జలదేవుడులు శివగామికి అసత్యాలు చెప్పడంతోనే.. ఆమె మనసు మారిపోతుందని.. అందుకే బాహుబలిని కట్టప్ప చేత చంపిస్తుందని సమాచారం. రానా, నాజర్‌లు చెప్పిన అసత్యాలు నమ్మిన శివగామి.. కట్టప్పచే బాహుబలిని చంపిస్తుందని టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే.