మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 1 మే 2016 (16:43 IST)

''బ్రహ్మోత్సవం" పాట రిలీజ్.. మహేష్ వైట్ కోట్‌లో అదుర్స్.. పెళ్ళి చేసుకుంటావా? (video)

టాలీవుడ్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం పాట టీజర్ రిలీజైంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు, ప్రసాద్ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 7న ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ''బ్రహ్మోత్సవం'' సినిమాలోని మధురం మధురం.. అనే పాటను టీజర్‌ రిలీజైంది. 
 
వైట్ కోట్‌లో మహేష్ బాబు లుక్ అదిరింది. ఈ టీజర్లో మహేష్ బాబు అందం చూసిన ఓ చిన్నారి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడుగుతున్నట్లు కనిపిస్తుంది. మహేష్ బాబును ఈ పాటలో చాలా చక్కగా చూపించారు. ఇక మిక్కీ జె. మేయర్‌, మణిశర్మ చిత్రానికి సంగీతం అందించారు. సమంత, కాజల్‌, ప్రణీత హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.