మంగళవారం, 28 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 18 నవంబరు 2016 (20:08 IST)

‘బేఫికర్’ లో 40 ముద్దు సీన్లు... ఒక్క సీన్ కూడా తీసేయకుండా జెండా ఊపినా సెన్సార్ బోర్డ్

రణవీర్ సింగ్, వాణికపూర్ జంటగా ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న బేఫికర్ సినిమా సునాయాసంగా సెన్సార్ కత్తెర నుండి తప్పించుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన హాట్ ట్రైలర్లు, ఫోటోలు సినిమా పై భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఈ చిత్రంలో దాదాపు వెర్రి

రణవీర్ సింగ్, వాణికపూర్ జంటగా ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న బేఫికర్ సినిమా సునాయాసంగా సెన్సార్ కత్తెర నుండి తప్పించుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన హాట్  ట్రైలర్లు, ఫోటోలు సినిమా పై భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఈ చిత్రంలో దాదాపు వెర్రిక్కించే 40 ముద్దు సీన్లు ఉన్నాయని, సెన్సార్ బోర్డ్ ఆక్షేపిస్తుందని చాలా మంది అనుకున్నారు. 
 
నిర్మాతకు తిప్పలు తప్పవని కూడా అందరూ భావించారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ, ఒక్క సీనుకు కూడా అడ్డు చెప్పకుండా సెన్సార్ బోర్డ్  ఈ చిత్రానికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చేసింది. రొమాంటిక్ సీన్లను కళాత్మకంగా ఆవిష్కరించే ఆదిత్యాచోప్రా ఈ చిత్రంలో కూడా తన ప్రతిభను చూపారని, ప్రేక్షకులకు నయనానందమేనని సినీ విశ్లేషకులు అంటున్నారు. 
 
రణవీర్ సింగ్ – వాణికపూర్ కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయిందని ట్రైలర్లు చూస్తేనే అర్ధమవుతుంది. డిసెంబర్ నెలలో విడుదల కానున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.