పాటల రికార్డింగ్‌తో ప్రారంభమైన జ్యోత్స్న ఫిలింస్‌ 'చారుశీల'

DV| Last Modified శనివారం, 12 సెప్టెంబరు 2015 (19:24 IST)
'జబర్దస్త్‌' ఫేం రష్మి టైటిల్‌ పాత్రలో.. జ్యోత్స్న ఫిలింస్‌ పతాకంపై.. శ్రీనివాస్‌ ఉయ్యూరు దర్శకత్వంలో శ్రీమతి జయశ్రీ అప్పారావు నిర్మిస్తున్న వినూత్న కథాచిత్రం 'చారుశీల'. జశ్వంత్‌, రాజీవ్‌ కనకాల, డా||బ్రహ్మానందం, ఇతర ముఖ్య తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం దేవుళ్ల పటాలపై హాస్యబ్రహ్మ డా||బ్రహ్మానందం తనయుడు-యువ కథానాయకుడు గౌతమ్‌ కొట్టిన క్లాప్‌తో ప్రారంభమైంది. ఇదే ముహూర్తానికి సుమన్‌ సంగీత సారధ్యంలో పాటల రికార్డింగ్‌కు కూడా శ్రీకారం చుట్టారు. పలువురు చిత్ర ప్రముఖులు ఈ వేడుకలో పాలు పంచుకొని 'చారుశీల' యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జ్యోత్స్న ఫిలింస్‌ అధినేత్రి శ్రీమతి జయశ్రీ అప్పారావు మాట్లాడుతూ.. ''మా సినిమా చాలా కొత్తగా ఉంటుందని అందరూ చెబుతుంటారు. కానీ.. మా 'చారుశీల' చిత్రాన్ని నిజంగానే చాలా కొత్త కథాంశంతో రూపొందిస్తున్నాం. ఇండియన్‌ సినిమా హిస్టరీలో ఇప్పటివరకు ఏ సినిమాకూ అనుసరించని సరికొత్త స్క్రీన్‌ప్లేతో 'చారుశీల' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ నెల 14న ప్రారంభించి.. సింగిల్‌ షెడ్యూల్‌లో హైద్రాబాద్‌ మరియు అరకులలో.. పాటలతో సహా షూటింగ్‌ పూర్తి చేయనున్నాం' అన్నారు.

రష్మి, జశ్వంత్‌, రాజీవ్‌ కనకాల, డా||బ్రహ్మానందం ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రానికి మాటలు: కుమార్‌ మల్లారపు, కూర్పు: నాగిరెడ్డి, సంగీతం: సుమన్‌, ఛాయాగ్రహణం: శ్రీనివాస్‌రెడ్డి, నిర్మాత: శ్రీమతి జయశ్రీ అప్పారావు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్‌ ఉయ్యూరు!!దీనిపై మరింత చదవండి :