"చీకటి గదిలో చితక్కొట్టుడు" ట్రైలర్ (వీడియో)
"చీకటి గదిలో చితక్కొట్టుడు" సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా టైటిల్ సాంగ్ రెండు రోజుల క్రితం విడుదలైంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ హీటెక్కిస్తోంది. ఇరుట్టు అరయిల్ మురుట్టు కుత్తు అనే సెక్స్-హారర్ తమిళ చిత్రాన్ని తెలుగులో చీకటి గదిలో చితక్కొట్టుడుగా రీమేక్ చేశారు.
కోలీవుడ్‌లో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయినా తెలుగులో దీన్ని రీమేక్ చేశారు. లీడ్ క్యారెక్టర్స్ అందరూ సెక్యువల్ సీన్లలో కనిపించారు. మొత్తం బూతు సినిమాగా ఇది మిగిలిపోయింది. ఇక అసలు ట్విస్ట్ ఏంట్రా అంటే… తనను తాను గొప్ప ఫిల్మ్ మేకర్, ఎనలిస్ట్‌గా చెప్పుకునే కత్తిమహేష్ ఈ మూవీని ప్రమోట్ చేస్తుండడమేనని సినీ జనం అంటున్నారు.
సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉండాలి గానీ… మరీ ఇంత బరితెగింపు ఉండకూడదని సినీ విశ్లేషకులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఎలా వుందో ఓ లుక్కేయండి.