శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 8 మే 2018 (10:13 IST)

''చి.ల.సౌ'' టీజర్ రిలీజ్.. సల్మాన్, హనుమాన్‌లా పెళ్లి చేసుకోకుండా వుంటే? (వీడియో)

కథానాయకుడు సుశాంత్ నటిస్తున్న తాజా చిత్రం ''చి.ల.సౌ''. ఈ సినిమా టీజర్ ప్రస్తుతం విడుదలైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజా టీజర్‌ను దగ్గుబాటి రానా సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఈ

కథానాయకుడు సుశాంత్ నటిస్తున్న తాజా చిత్రం ''చి.ల.సౌ''. ఈ సినిమా టీజర్ ప్రస్తుతం విడుదలైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజా టీజర్‌ను దగ్గుబాటి రానా సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఈ టీజర్లో.. సల్మాన్, హనుమాన్‌లా శాశ్వతంగా పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎంత బాగుంటుందని సుశాంత్ అంటుంటే.. మరోవైపు ఆంజనేయుడి ముందు కుమారుడి మనసు మారాలని అతడి తల్లి వేడుకోవడాన్ని చూపించారు. 
 
ఈ చిత్రంలో కామెడీ ట్రాక్ అధికంగా వుంటుందని టీజర్ చూసిన వారంతా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా కొత్తమ్మాయి రుహని శర్మను పరిచయం చేస్తున్నారు. తన పేరు అర్జున్‌ అని, తాను సల్మాన్‌ ఖాన్‌ అభిమాని, ఆంజనేయస్వామి భక్తుడినని సుశాల్‌ ఈ టీజర్‌లో చెప్పాడు. ఈ టీజర్‌ను మీరూ ఓ లుక్కేయండి.