శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 మే 2017 (11:57 IST)

సుశాంత్ తండ్రి మృతి.. విషాదంలో అక్కినేని ఫ్యామిలీ

అక్కినేని ఫ్యామిలీ విషాదంలో మునిగిపోయింది. హీరో సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణరావు (68) కన్నుమూశారు. రెండేళ్ల పాటు అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు.

అక్కినేని ఫ్యామిలీ విషాదంలో మునిగిపోయింది. హీరో సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణరావు (68) కన్నుమూశారు. రెండేళ్ల పాటు అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు.
 
అక్కినేని నాగార్జునకు బావ అయిన సత్యభూషణ రావు మృతి చెందిన విషయం తెలుసుకున్న తారలంతా వారి ఫ్యామిలీకి సంతాపం ప్రకటిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ దంపతుల రెండో కుమార్తె నాగ సుశీలను సత్యభూషణ రావు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 
 
కాగా నాగ సుశీల, సత్యభూషణ రావు దంపతుల కుమారుడు సుశీల్ కాళిదాసు, ఆటాడుకుందాం రా, కరెంట్ వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. ఇక శ్రీ నాగ్ కార్పొరేషన్ పతాకంపై నాగ సుశీల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యభూషణ రావు మృతితో నాగచైతన్. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ రద్దయ్యింది. ఈ వేడుక గురువారం సాయంత్రం జరగాల్సివుంది.