శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (09:29 IST)

వర్మ కామెంట్స్‌పై లంచ్ బ్రేక్‌లో బాగా మాట్లాడుకోవచ్చు : చిరంజీవి కుమార్తె సుస్మిత

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా చేసుకుని చేసే ట్వీట్స్‌పై మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కామెంట్స్ చేశారు. ఆర్జీవీ కామెంట్స్‌ను పెద్దగా తీసుకోవాల్సిన పనిలేదన్నారు. ఇవి కేవ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా చేసుకుని చేసే ట్వీట్స్‌పై మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కామెంట్స్ చేశారు. ఆర్జీవీ కామెంట్స్‌ను పెద్దగా తీసుకోవాల్సిన పనిలేదన్నారు. ఇవి కేవలం లంచ్ బ్రేక్‌లో మాట్లాడుకునేందుకు తప్పా ఇంకెందుకు పనికిరావని ఆమె చెప్పుకొచ్చారు. 
 
ఇటీవలి కాలంలో మెగా ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకుని వర్మ కామెంట్స్ చేస్తున్న విషయం తెల్సిందే. వీటిపై ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఖాళీ సమయంలో వర్మ ట్వీట్లు చూసి నవ్వుకుంటామని, ఒకరు మాట్లాడే మాటలను మనం నియంత్రించలేమని, ఎందుకంటే, ప్రతి ఒక్కరికీ మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛా హక్కు ఉందన్నారు. అయితే, పూర్తిగా నెగెటివ్‌గా మాట్లాడే వారిని సామాజిక మాధ్యమాల నుంచి బ్లాక్ చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు.