సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 5 మే 2019 (11:36 IST)

చిరంజీవి సత్తా అంతేనా... రాజమౌళి కంటే తక్కువ విరాళమా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వకష్టంతో మెగాస్టార్ రేంజ్‌కి ఎదిగిన వ్యక్తి చిరంజీవి. ఈయన ఆస్తులు కూడా అలాగే క్రమక్రమంగా ఎదిగాయి. అయితే, విరాళాలు ఇవ్వడంలో మాత్రం ఈయనకు పెద్దమనసు లేదని పలువురు అంటుంటారు. తాజాగా ఇది మరోమారు నిరూపితమైంది. 
 
స్వ‌ర్గీయ దర్శకరత్న దాసరి నారాయణ రావు పుట్టిన రోజును ప్రతి ఏటా డైరెక్టర్స్ డే (తెలుగు చిత్ర పరిశ్రమల దర్శకుల దినోత్సవం)గా నిర్వహిస్తున్నారు. అలాగే, ఈ నెల 4వ తేదీన దాసరి పుట్టినరోజుని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్‌కి సంబంధించిన ప‌లువురు ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు , ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. 
 
రెండు గంటల పాటు అక్కడే ఉన్న చిరంజీవి.. దాస‌రితో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు ద‌ర్శ‌కుల సంఘానికి త‌న వంతు సాయంగా రూ.25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇక ద‌ర్శ‌క ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి రూ.50 ల‌క్ష‌లు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర‌ రావు 25 ల‌క్ష‌ల రూపాయల చొప్పున విరాళాన్ని ప్రకటించారు.