శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 31 మే 2017 (10:40 IST)

ఖైదీ కొత్త రికార్డ్: అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు, రత్తాలు రత్తాలు పాటల్ని రెండేసి సార్లు?!

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. దాదాపు దశాబ్ధం తర్వాత చేసిన ఖైదీ నెం.150 సినిమా టీఆర్పీల్లో నెం.1 స్థానంలో నిలిచింది. గత ఆదివారం ఓ టీవీ ఛానెల్‌లో ఈ సినిమా ప్రసారమైంది. మరో ఛా

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. దాదాపు దశాబ్ధం తర్వాత చేసిన ఖైదీ నెం.150 సినిమా టీఆర్పీల్లో నెం.1 స్థానంలో నిలిచింది. గత ఆదివారం ఓ టీవీ ఛానెల్‌లో ఈ సినిమా ప్రసారమైంది. మరో ఛానల్‌లో ఐఫా అవార్డుల కార్యక్రమం ప్రసారమైనా.. ప్రేక్షకులు మాత్రం ఖైదీ నెం.150కే పట్టం కట్టారు. 
 
అభిమానుల ఉత్సాహాన్ని గమనించిన సదరు ఛానెల్ నిర్వాహకులు కూడా ఈ సినిమాలోని.. ‘అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు’, ‘రత్తాలు రత్తాలు’ పాటలను రెండేసి సార్లు ప్రసారం చేశారు. టీవీ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. 
 
కాగా.. ఖైదీ నెం.150 సినిమా చిరంజీవి హిట్ లిస్టులో చేరిపోయింది. దాదాపు వంద కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా ఈ సినిమాకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని తాజాగా విడుదలైన టీఆర్పీ రేటింగ్ ద్వారా వెల్లడి అయ్యింది.