చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ : కత్తిలాంటోడు... గౌతమీపుత్ర శాతకర్ణి పోటీ!
టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇద్దరూ సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మెగాస్టార్ 150వ చిత్రం, బాలయ్య 100వ చిత్రంపైనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఇద్దరి హీరోలతో పోలిస్తే బాలయ్య 100 సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'కే హైప్ ఎక్కువ అంటున్నారు సినీ పండితులు. ఎందుకంటే చిరంజీవి 150 వ సినిమా ఎపుడెపుడు వస్తుందాని ఎదురుచూసిన తరుణంలో ఎట్టకేలకు సినిమా ఫైనల్ అయ్యింది. తమిళంలో ఘనవిజయం సాధించిన బ్లాక్ బస్టర్ ''కత్తి'' రీమేక్‌గా తెలుగులో ''కత్తిలాంటోడు'' టైటిల్‌తో తెరకెక్కుతున్న విషయం దాదాపు 6 నెలల క్రితమే అందరికీ తెలుసు. కథ మొత్తం దాదాపుగా అందరికి తెలిసిందే.
వి.వి వినాయక్ ఈ కథలో మెగాస్టార్‌ని దృష్టిలో పెట్టుకుని కథలో కొన్ని మార్పులు చేర్పులు చేశాడు. ఇది ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి. ఇక బాలయ్య 100వ సినిమాని తీసుకుంటే చారిత్రాత్మక చిత్రాన్నిఎంచుకున్నాడు. దీనికి తోడు క్రిష్ ఇప్పటివరకు దర్శకుడిగా పరాజయం పొందిన సినిమాలు లేవు కాబట్టి శాతకర్ణిపైనే అందరి దృష్టి నెలకొంది. దాంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో హాటెస్ట్ మూవీ మాత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే బాలయ్య శాతకర్ణితో ఇంకో స్క్రిప్ట్‌ని రెడీ చేసుకున్నారు. రెండు సబ్జెక్టులో ఓ సినిమా ఫైనల్ చేసుకుని, చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. కాబట్టి ఆ విధంగా చూస్తే బాలయ్య బెటర్ అనిపించేసుకున్నాడు.