శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 5 జనవరి 2017 (12:19 IST)

మరిది పవన్‌ను ఆహ్వానించిన వదిన సురేఖ.. అన్నయ్య కోసం తమ్ముడు వస్తాడో? రాడో?

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీ నంబర్ 150'. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఈనెల 7వ తేదీన గుంటూరు వేదికగా జరుగనుంది. ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 150వ సినిమా వేడుకకు మరిది పవర్ స్

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీ నంబర్ 150'. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఈనెల 7వ తేదీన గుంటూరు వేదికగా జరుగనుంది. ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 150వ సినిమా వేడుకకు మరిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించేందుకు మెగాస్టార్ చిరంజీవి భార్య, పవన్ వదిన అయిన సురేఖ రంగంలోకి దిగారు. 
 
పవన్ కోసం సురేఖ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి హాయ్ ల్యాండ్‌లో జరిగే వేడుకకు రావాలని ఆహ్వానించనున్నట్టు సమాచారం. జనవరి 7న జరిగే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు తాను తల్లిలా భావించే సురేఖ పిలిస్తే, పవన్ తప్పకుండా వస్తాడని అభిమానులు సైతం భావిస్తున్నారు. 
 
కాగా, తాను బాబాయ్‌ని పిలుస్తానని, రావడం, రాకపోవడం ఆయనిష్టమని టాలీవుడ్, ఈ చిత్ర నిర్మాత, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేల్చేసిన నేపథ్యంలో, సురేఖ పవన్ ఇంటికి వెళ్లనున్నారని వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది.