శనివారం, 16 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 5 మే 2017 (08:08 IST)

దాసరి నిజంగా మృత్యుంజయుడే.. ఆస్పత్రినుంచి సగమై వచ్చారు.

మూడు నెలల క్రితం తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లి రెండు నెలలపాటు బెడ్ మీదే ఉండి, శస్త్ర చకిత్సలు చేయించుకుని మృత్యువు కోరలనుంచి బయటపడి వచ్చిన దర్శక రత్న దాసరి నారాయణ రావును ఇప్పుడాయన ఇంట్లో చూస్తుంటే నిజంగా బాధ వేస్తుంది.

మూడు నెలల క్రితం తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లి రెండు నెలలపాటు బెడ్ మీదే ఉండి, శస్త్ర చకిత్సలు చేయించుకుని మృత్యువు కోరలనుంచి బయటపడి వచ్చిన దర్శక రత్న దాసరి నారాయణ రావును ఇప్పుడాయన ఇంట్లో చూస్తుంటే నిజంగా బాధ వేస్తుంది. చిత్రపరిశ్రమ బాగుకోసం చిన్న సినిమాల కోసం, సినిమా నిచ్చెన మెట్ల మీద అట్టడుగున ఉన్నవారికోసం అహర్నిశలూ శ్రమిస్తూ, వారి సంక్షేమం కోసం నిత్యం పాటు పడుతూ నిండు రూపంతో భరోసా కలిగిస్తూ వచ్చిన ఆ దాసరి రూపం ఇప్పుడు లేదు. శరీరంలో మూడింట రెండొంతుల ప్యాట్‌ని తీసేసిన చందంగా తన జీవితంలోనే తొలిసారి పీలగా కనిపిస్తున్న దాసరిని చూస్తున్న వారికి నిజంగా కలుక్కుమంటోంది. ఎంత ప్రమాదం నుంచి ఆయన బయట పడి వచ్చారో ఆయన రూపమే చెబుతోంది. 
 
గురువారం దాసరి పుట్టినరోజు కావడంతో పలువురు చలన చిత్రరంగ ప్రముఖులు దాసరి స్వగృహానికి వెళ్లి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఆస్పత్రిలో చేరి, చికిత్స అనంతరం ఇంటి పట్టున విశ్రాంతిలో ఉంటున్న దాసరి కోలుకున్నట్లు కనిపించడం అందర్నీ ఆనందపరిచింది. గతంలో ఆయనకు ప్రకటించిన అల్లు రామలింగయ్య అవార్డును
అందజేయడానికి గురువారం సాయంత్రం ఆయన ఇంటికి చిరంజీవి, అల్లు అరవింద్ వెళ్లి అవార్డు ఇస్తున్న ఫొటో పత్రికలలో చూసినప్పుడు అందరికీ విచారం. 
 
ఆ విచారాన్ని దిగమింగుకున్న చిరంజీవి  చిత్రపరిశ్రమకు దాసరి వెన్నెముకలా ఉంటూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నా అన్నారు. ఆయన ఆస్పత్రిలో ఉన్నప్పుడు నా ఖైదీ నంబర్‌ 150 గురించి అడిగి తెలుసుకోవడం ఆనందాన్నిచ్చిందన్నారు.  ‘‘గురువు (దాసరి) గారికి అల్లు రామలింగయ్య అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉంది. అల్లు రామలింగయ్యగారితో కొన్ని సినిమాలు చేశాను. ఆ కుటుంబంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. గురువుగారు కోలుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. ఆయన వందేళ్లు ఆనందంగా ఉండాలి’’ అన్నారు మోహన్ బాబు.
 
దాదాపు మూడు నెలల తర్వాత అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉందని దాసరి ఈ సందర్భంగా అన్నారు. నిజంగా కూడా ఆయన మృత్యుంజయుడే.. చిత్రసీమ మంచిని కోరుకోవడం తప్ప అందరూ బాగుండాలని ఆశించడం తప్ప మరే స్వార్థ ప్రయోజనాలూ ఆశించని దాసరి వంటి దిగ్ధంతులు పది కాలాలపాటు ఆరోగ్యంగా ఉండటమే ఆయన పుట్టి పెరిగిన చిత్రసీమకు మంగళకరమవుంతుంది