ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 జనవరి 2018 (13:36 IST)

పద్మావతికి మోక్షం ... జనవరి 25న రిలీజ్?

బాలీవుడ్ దర్శకుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం "ప‌ద్మావతి". ఈ మూవీ షూటింగ్ మొద‌లైన‌ప్ప‌టి నుండి అనేక వివాద‌ల‌తో వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంది.

బాలీవుడ్ దర్శకుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం "ప‌ద్మావతి". ఈ మూవీ షూటింగ్ మొద‌లైన‌ప్ప‌టి నుండి అనేక వివాద‌ల‌తో వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంది. రాజ్‌పుత్ క‌ర్ణిసేన వర్గానికి చెందిన ప్రజలు ఈ చిత్ర విడుదలను అడ్డుకోవడమే కాకుండా, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పద్మావతి చిత్ర విడుదలపై నిషేధం విధించింది. 
 
దీంతో డిసెంబ‌ర్ 1వ తేదీ రిలీజ్ కావ‌ల‌సి ఉన్న ఈ చిత్రం పలు వివాదాల న‌డుమ వాయిదాలు ప‌డుతూ వ‌చ్చింది. అయితే ఎట్ట‌కేల‌కు ఈ చిత్రం జ‌న‌వ‌రి 25న రిలీజ్ కావ‌డానికి రెడీగా ఉంద‌ని తెలుస్తుంది. 
 
చ‌రిత్రను వక్రీకరించినందున ప‌ద్మావ‌తి సినిమాని విడుద‌ల కానివ్వ‌మ‌ని క‌ర్ణిసేన‌తో పాటు ప‌లువురు ఆందోళ‌నకారులు ప‌ట్టుబ‌ట్టుకు కూర్చోవ‌డంతో , సెన్సార్ బోర్డ్ చిత్ర టైటిల్ ప‌ద్మావ‌తిని ప‌ద్మావ‌త్‌గా మార్చాలని, కొన్ని సన్నివేశాలు కూడా తొల‌గించాల్సి ఉంటుంద‌ని పేర్కొనింది. దీనికి చిత్ర యూనిట్ కూడా ఓకే చెప్ప‌డంతో రిలీజ్‌కి మార్గం సుగ‌మం అయిన‌ట్టు తెలుస్తుంది.