మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 జనవరి 2018 (13:21 IST)

శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు ... ఏప్రిల్ కోటా రిలీజ్

తిరుమల గిరుల్లో వెలసిన ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సేవల్లో భాగంగా ఆర్జిత సేవల టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. కొత్త సంవత్సరంలో ఏప్రిల్ నెలకు కోటాకు సంబంధించి మొత్తం 56,59

తిరుమల గిరుల్లో వెలసిన ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సేవల్లో భాగంగా ఆర్జిత సేవల టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. కొత్త సంవత్సరంలో ఏప్రిల్ నెలకు కోటాకు సంబంధించి మొత్తం 56,593 టికెట్లు ఉన్నాయి. ఉదయం 10 గంటల నుండి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. 
 
ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 10,658 సేవా టిక్కెట్లు విడుదలయ్యాయి. ఇందులో సుప్రభాతం 7,878, తోమాల మరియు అర్చన 240, అష్టదళపాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 2300 టికెట్లు ఉన్నాయని వివరించారు. సేవా టిక్కెట్ల బుకింగ్‌ను 4 రోజుల సమయానికి తగ్గించినట్టు తెలిపారు.
 
ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో మొత్తం 45,935 సేవాటికెట్లు కాగా, వీటిలో విశేషపూజ 1,875, కల్యాణం 11,250, ఊంజల్‌సేవ 3000, ఆర్జిత బ్రహ్మోత్సవం 5,805, వసంతోత్సవం 11,180, సహస్ర దీపాలంకారసేవ 12,825 ఉన్నాయని ఆయన తెలిపారు.