శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2017 (11:51 IST)

జయలలిత అపోలో ఆస్పత్రి చికిత్స వీడియో

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్న వీడియోను టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన చెన్నై పెరంబూర్ ఎమ్మెల్యే వెట్రివేల్ బుధవారం రిలీజ్ చేశారు.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్న వీడియోను టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన చెన్నై పెరంబూర్ ఎమ్మెల్యే వెట్రివేల్ బుధవారం రిలీజ్ చేశారు. ఈ వీడియో ఓ తమిళ చానల్‌లో రిలీజ్ చేశారు. ఆ వీడియోను మీరూ చూడండి. ఇందులో జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గ్లాసులో జ్యూస్ తాగుతున్నట్టుగా ఉంది. కేవలం 20 సెకన్ల పాటు ఉన్న వీడియోను టీటీవీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే వెట్రివేల్ రిలీజ్ చేసినట్టు వెల్లడించారు. 
 
జయలలిత మరణంతో ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్కే.నగర్ అసెంబ్లీ స్థానానికి ఈనెల 21వ తేదీన ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో శశికళ వర్గం తరపున టీటీవీ దినకరన్ పోటీ చేస్తుండగా, అన్నాడీఎంకే తరపున సీనియర్ నేత, ఆ పార్టీ ప్రిసీడియం ఛైర్మన్ ఇ.మధుసూదనన్ పోటీ చేస్తున్నారు. అలాగే, డీఎంకే తరపున మరుద గణేష్ బరిలో ఉన్నారు.