శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (12:11 IST)

జయలలితను ఊపిరాడని స్థితిలో ఆస్పత్రిలో చేర్పించారు : ప్రీతా రెడ్డి

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. తన మేనత్తపై దాడి జరిగిందని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఆరోపించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. తన మేనత్తపై దాడి జరిగిందని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆమె జయలలిత మృతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసి నిజనిర్ధారణ కమిటీ ఎదుటు హాజరై తన సాక్ష్యం చెప్పింది. 
 
తాజాగా జయలలితకు చికిత్స చేసిన అపోలో ఆస్పత్రి వైస్ ఛైర్‌పర్సన్ ప్రీతారెడ్డి ఓ తమిళ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాన్ని వెల్లడించింది. సెప్టెంబరు 12వ తేదీ రాత్రి "ఊపిరాడని స్థితిలో ఉన్న జయను ఆసుపత్రికి తీసుకొచ్చారు. తక్షణం సరైన చికిత్స అందించడంతో కోలుకున్నారు" అని ఆమె పేర్కొన్నారు. అయితే దురదృష్టవశాత్తు చివరికి ఫలితం మాత్రం అందరూ ఊహించినట్టుగాకాకుండా వేరేలా వచ్చిందన్నారు.
 
జయలలితకు ప్రపంచంలోనే నిపుణులైన వైద్యులతో చికిత్స చేశామని, క్వాలిఫైడ్ నర్సులు, టెక్నీషియన్స్, ఫిజియోథెరపిస్టులు ఆమెను నిరంతరం కంటికి రెప్పలా చూసుకున్నారని తెలిపారు. జయలలిత మృతిపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ మిస్టరీని ఛేదిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.