శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (16:06 IST)

పోలవరంపై చంద్రబాబు తప్పుడు లెక్కలు : పురందేశ్వరి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులు విడుదల చేయడం లేదన్న టీడీపీ నేతల ఆరోపణలను బీజేపీ మహిళా నేత పురందేశ్వరి కొట్టిపారేశారు. పోలవరంపై ఏపీ సర్కారు తప్పుడు లెక్కలు చెపుతోందని ఆమె సంచలన ఆరోపణలు చే

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులు విడుదల చేయడం లేదన్న టీడీపీ నేతల ఆరోపణలను బీజేపీ మహిళా నేత పురందేశ్వరి కొట్టిపారేశారు. పోలవరంపై ఏపీ సర్కారు తప్పుడు లెక్కలు చెపుతోందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. 
 
ఇదే అంశంపై ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సరైన లెక్కలు పంపితే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని అన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందనడం సరికాదని, ఏపీకి ప్రత్యేక హోదా బదులు ఎక్స్‌ట్రీమ్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ (ఈఏపీ) కింద నిధులు ఇస్తుందని అన్నారు. 
 
కాగా, పోలవరం ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని విపక్షనేత జగన్‌తో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడంతో ఏపీ సర్కారు స్పందించింది. పోలవరం లెక్కలన్నీ ఆన్‌లైన్‌లో ఉంచుతున్నట్టు ప్రకటించింది.