విమర్శలు అలవాటయ్యాయిః రష్మిక
Rahimka
పుట్టినరోజున సందర్భంగా ఓ మలయాళ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఆమె నటించిన కన్నడ కిట్టీపార్టీ అనుభవాలు తెలియజేయమంది. ఆ సినిమా ద్వారానే ఆమె వెలుగులోకి వచ్చింది. అందులో సెక్స్ గురించి వున్న అంశాన్ని చెప్పమనగా.. మీ విషయం నాకు ఎలా తెలుస్తుందనేలా చలోక్తి విసిరి తెలివిగా దాట వేసింది. సినిమాను సినిమాపరంగా చూడాలంటూ చురక వేసింది.
Rashmika exercise
తెలుగులో 2018లో నాగశౌర్య `ఛలోతో పరిచయమయ్యారు. గీతగోవిందం సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో పుష్పలో నటిస్తున్నారు. తన మొదటి సినిమా హీరో రక్షిత్‌శెట్టితో రష్మికకు నిశ్చితార్థమైన విషయం తెలిసిందే. కాకపోతే కొన్ని కారణాల వల్ల వాళ్లిద్దరూ విడిపోయారు. దాంతో టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోతో రష్మిక ప్రేమలో ఉందని అందరూ చెప్పుకున్నారు. తను ఎంత బిజీగా వున్నా క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో వర్కౌట్లు చేస్తూనే వుంటానని చెబుతోంది. బాడీని తగ్గించుకునే క్రమంలో ఇటీవలే మాంసాహారానికి దూరమయ్యానని అంటోంది.
