శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , మంగళవారం, 16 మే 2017 (08:51 IST)

చైనాలో దంగల్ సునామీ.. టాప్ వన్ సినిమాగా అమీర్ ఖాన్ రికార్డు.. బాహుబలి-2కి నిజమైన పోటీ

చైనాలో కలెక్షన్ల వరద సృష్టిస్తున్న అమీర్ ఖాన్ చిత్రం దంగల్ హాలీవుడ్ తాజా చిత్రాలను కూడా తోసిరాజని టాప్ వన్ స్థానాన్ని చేజిక్కించుకుంది. తొలివారంలో టాప్ వన్ స్థానంలో ఉన్న గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ-2

చైనాలో కలెక్షన్ల వరద సృష్టిస్తున్న అమీర్ ఖాన్ చిత్రం దంగల్ హాలీవుడ్ తాజా చిత్రాలను కూడా తోసిరాజని టాప్ వన్ స్థానాన్ని చేజిక్కించుకుంది. తొలివారంలో టాప్ వన్ స్థానంలో ఉన్న గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ-2 సినిమాను రెండోవారంలో రెండో స్థానానికి నెట్టివేసిన దంగల్ అటు కలెక్షన్లలోనూ కేవలం 10 రోజుల్లో 350 కోట్ల రూపాయలు వసూలు చేసి చైనాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాగా చరిత్రకెక్కింది. 7 వేల థియేటర్లలో విడుదలైన చైనా దంగల్ ఇదే జోరు కొనసాగిస్తే బాహుబలి-2కి కూడా పోటీ ఇవ్వడమే కాదు, బాహుబలి కలెక్షన్లను కూడా మించిపోవచ్చని చెబుతున్నారు. 
 
 
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం దంగల్ చైనా ప్రేక్షకులు మంత్రముగ్ధులను చేస్తున్నట్లు వార్తలు. కుస్తీపోటీల్లో ప్రపంచ ఛాంపియన్లుగా తన కుమార్తెలను నిలబెట్టాలని తపించిన కుస్తీ యోదుడి నిజజీవిత గాథను అమీర్ ఖాన్ దంగల్ గా మలిచారు. పేదరికపు హద్దులు దాటి ప్రపంచ క్రీడాయవనికలో మెరిసిన అమీర్ పెద్ద కూతురుగా నటించిన గీత పాత్రలో చైనా సమాజం తన్ను తాను చూసుకుందని, అందుకే దంగల్ సినిమాకు చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని సమాచారం. 
 
చైనాలో సుయి జియావో బాబా పేరుతో దంగల్ సినిమాను 7 వేలకు పైగా థియేటర్లలో మే 5 న విడుదల చేశారు. సుయి జియావో బాబా అంటే కుస్తీ ఆడదాం నాన్నా అని అర్థం. వెనుకబాటుతనపు పరిస్థితుల్లోంచి ఆణిముత్యాలుగా మెరుస్తున్న చైనా గ్రామీణ సమాజానికి చెందిన అమ్మాయిలను, వారి కష్టాలను గీతా పాత్రలో చైనా ప్రేక్షకులు చూసుకుంటున్నారట. అందుకే కేవలం పది రోజుల్లో 59.7 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. రెండో వారం కూడా 32.5 మిలియన్ల కలెక్షన్లతో చైనాలో టాప్ 1 సినిమాగా దంగల్ నిలిచింది.
 
చైనా ప్రేక్షకుల ఆపార ఆదరణతో శని, ఆదివారాల్లో మరో 55 వేల ఆటలను అదనంగా ప్రదర్శించారు. కేవలం పది రోజుల్లోనే 350 కోట్లు వసూలు చేసిన దంగల్ బాహుబలి2కి నిజమైన పోటీని ఇస్తోంది. దంగల్‌తోపాటు ఒకే రోజు చైనాలో విడుదలనై డీస్నీ వారి గార్డియన్స్ ఆప్ ది గెలాక్సీ-2 చిత్రం తొలి వారం అదరగొట్టినా రెండో వారానికే చల్లబడిపోయి అగ్రస్థానాన్ని దంగల్ పరం చేసింది. చైనాలో ఇంతవరు పీకే పేరుతో ఉన్న అత్యధిక కలెక్షన్ల రికార్డును దంగల్ తుడిచి పెట్టేసింది. చైనాలో పీకే మొత్తంవసూల్లు రూ. 100 కోట్లు. చైనాలో అత్యంత ప్రజాదరణ గల భారతీయ నటుల్లో అమీర్ ఒకరు. దక్షిణకొరియా నటీనటులంటే చెవికోసుకునే చైనా ప్రేక్షకులు అమీర్ ఖాన్‌ను కూడా అదే స్థాయిలో ఆదరిస్తున్నారు.

బాహుహలి కథారచయిత విజయేంద్రప్రసాద్ ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ బాహుబలి-2 రికార్డును మరో చిత్రం బద్దలు చేస్తే తానెంతో సంతోోషిస్తానని చెప్పారు. ఒక సినిమాను మంచి మరొక సినిమా పైచేయి సాదిస్తేనే చిత్రపరిశ్రమ పచ్చగా ఉంటుందని, పదిమందికి అవకాశాలు దొరుకుతాయని విజయేంద్రప్రసాద్ అబిప్రాయపడ్డారు. బాహుబలి 2ని బీట్ చేయడం పక్కనబెట్టండి.. కుస్తీ పోటీల్లో జీవితాన్ని పండించుకున్న పేద అమ్మాయి పట్టుదలే ఇతివృత్తంగా అమీర్ ఖాన్ ీతీసిన దంగల్ చిత్రం బాహుబలి దరిదాపుల్లోకి రావడం, పరిస్థితులు అనుకూలిస్తే బాబుబలిృ2 రికార్డులను బద్దలు కొడితే కూడా ఎవరైనా పాజిటివ్‌గా తీసుకోవడమే మార్గం.