1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2016 (18:12 IST)

చిరంజీవి ఒప్పుకుంటే ''ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'' కోసం ఎన్నికోట్లైనా వెచ్చిస్తా: దాసరి కిరణ్

మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని మరోసారి నిర్మాత దాసరి కిరణ్ చాటుకున్నారు. చిరంజీవి రాజకీయాల్లో కొనసాగినా సరే.. సినిమాల్లో నటించినా.. ఆయనపై ఉన్న అభిమానం ఏమాత్రం చెరిగిపోదన్నారు. పరుచూరి బ్రదర

మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని మరోసారి నిర్మాత దాసరి కిరణ్ చాటుకున్నారు. చిరంజీవి రాజకీయాల్లో కొనసాగినా సరే.. సినిమాల్లో నటించినా.. ఆయనపై ఉన్న అభిమానం ఏమాత్రం చెరిగిపోదన్నారు. పరుచూరి బ్రదర్స్ చిరంజీవి కోసమేనని రాసుకున్న ''ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'' కథని వినిపించారు. చిరంజీవిగారు అంగీకరిస్తే.. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా.. ఆయనతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను తెరకెక్కిస్తానని దాసరి కిరణ్ చెప్పుకొచ్చారు. 
 
ముందుగా పరుచూరి బ్రదర్స్ రాసిన ఈ కథను సినిమాగా రూపొందిస్తే తాను నిర్మాతగా వ్యవహరించాలని నిర్మాత దాసరి కిరణ్ భావించారు. గతంలో చిరంజీవి 150 సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఎందుకో ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాలేదు. అయితే ఈ సినిమాపై ఇంకా ఆశలు పెట్టుకున్నారు నిర్మాత దాసరి కిరణ్. ఇంకా ఈ సినిమాను చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కించేందుకు దాసరి కిరణ్ మల్లగుల్లాలు పడుతున్నారు. మరి చిరంజీవి ఓకే చెప్తారో లేదో వేచి చూడాల్సిందే.